Monday, 23 March 2020

Flattening the Pandemic Curve and stopping of spread of Novel Corona Virus(COVID-19)

Flattening the Pandemic Curve and stopping of spread of Novel Corona Virus(COVID-19)



Flattening the Pandemic Curve is most important to avoid the spread of Novel Corona Virus (COVID-19). The Government of India and the Governments of many states in India has declared Lock Down in to protect the people from Novel Corona Virus. Doctors and Family Health Department is trying to flatten the Pandemic Curve in the country. In this regards we as a people of India needs to know about the present prevailing health situations India and flattening the Pandemic Curve.

State of emergency

A state of emergency can be declared during natural disasters, epidemics and other public health emergencies. Declaring a state of emergency, as more than 75 Distrticts in India— have done, The government officials the authority to take extra measures to protect the public, such as suspending regulations or reallocating funds to mitigate the spread of a disease.

While antibiotics don’t work against viruses, researchers are testing drugs that could disrupt viral proteins and stop the infection.

కరోనా వైరస్ - ప్రపంచ మహమ్మారి


నేను డాక్టర్ గా(ఆమెరికాలో పని చేస్తున్న మన తెలుగు వైద్యురాలు) పోస్టులు పెట్టేది చాలా అరుదు. కరోనా వైరస్ గురించి చాలా మంది అజ్ఞానం చూస్తూ మాట్లాడకుండా ఉండలేక రాస్తున్నాను. చెప్పడం నా బాధ్యత కూడా! చెప్పాలంటే చాలా ఉంది కాని ఈ పోస్టులో ముఖ్యమైన విషయాలు రాసే ప్రయత్నం చేస్తాను. 

నేను అమెరికాలో ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ గా పని చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయాలు ఉన్నయని చెప్పుకునే అమెరికాలో పరిస్థితికి ప్రత్యక్ష సాక్షిగా చెప్పే విషయాలు ఇవి. 

రెండు వారాల క్రితం వాషింగ్టన్ లో మొదలై అన్ని రాష్ట్రాలకు పాకిన కరోనా వైరస్ అమెరికా ని ప్రస్తుతం అతలాకుతలం చేస్తుంది. రెండు వారాలుగా మన ప్లాన్ ఏంటి అని తర్జనబర్జనలు పడుతున్న మా క్లినిక్ లో మార్చ్ 12 న అన్ని healthcare systems లో లాగానే పెనుమార్పులు జరిగినయ్. 

ముందు నుండే పరిస్థితి ని దగ్గరగా గమనించేవాళ్లకి అర్థమయినా మొదటిసారి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి official notice లో వచ్చిన సమాచారం ఒక్కసారిగా అందరినీ ఒక్క కుదుపు కుదిపింది. తీవ్రమైన వ్యాధితో హాస్పిటల్ అడ్మిషన్ లు అవసరం ఉన్నవాళ్లను తప్ప కరోనావైరస్ టెస్ట్ చేయడానికి టెస్ట్ కిట్స్ లేవనేది దాని సారాంశం. అంటే కరోనా వైరస్ వచ్చిన వారిలో తేలికపాటి వ్యాధిలక్షణాలు (mild symptoms) ఉండే 80% మందిని టెస్ట్ చేయడానికి ఇప్పటికైతే లేదు. అంటే Covid-19 ఉన్న వాళ్లందరినీ గుర్తించి వేరు (isolate) చేసే అవకాశం లేదు. వాళ్లు యధావిధిగా వైరస్ ని వ్యాపిస్తూ పోతారు. అంటే ప్రస్తుతం న్యూస్ లో చెప్పే నంబర్లన్నీ అర్థం లేనివి. టెస్ట్లు లేకపోతే పాజిటివ్ లు లేవు కదా! అయితే కొద్ది రోజుల్లో ఎంతమందినైనా టెస్ట్ చేయగలిగే అన్ని టెస్టులు వస్తాయి. కానీ జరగాల్సిన నష్టం ఇప్పటికే చాలా జరిగిపోయింది. The horse has left the barn!

పేషెంట్లను గుర్తించి వారిని quarantine చేయలేని ఈ పరిస్థితుల్లో చేయగలిగింది ఒక్కటే. వైరస్ వ్యాప్తిని వీలయినంత తగ్గించడం. అది చేయగలిగింది 'social distancing' తో మాత్రమే. అంటే మనుషులను isolate చేయడం, events cancel చేయడం, మనుషులు సమూహాల్లో, గుంపులుగా కలవకుండా నివారించడం. ఇందులో ప్రభుత్వాలు ఏమి చేయాలి, వైద్య వ్యవస్థ ఏమి చేయాలి, ప్రజలు ఏమి చేయలి అనేది ఇంకో పెద్ద పోస్టు రాయొచ్చు. అయితే అందరూ వాళ్లు చేయాల్సింది చేయకపోతే ఈ వైరస్ వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని అరికట్టే అవకాశం లేదు. We need all hands on deck! 

వైరస్ సోకిన అందరినీ టెస్ట్ చేయలేమన్న కొత్త ఎరుకతో మా హాస్పిటల్ సిస్టం లో డాక్టర్లు, మేనేజర్లు, లీడర్షిప్ అందరూ అప్రమత్తమయ్యారు. మా క్లినిక్ లో ఇప్పుడు ప్రత్యక్షంగా పేషెంట్లను చూడడం ఆపేసినం. అత్యవసరమైన వైద్యసదుపాయాలు అవసరమైన వారిని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి పంపుతున్నాం. మిగిలిన వాళ్లతో ఫోన్ విజిట్స్ చేస్తున్నాం. Regular follow up విజిట్స్ అన్నీ రెండు నెలలు postpone చేస్తున్నాం. 

ఇప్పుడున్న పెద్ద ప్రమాదం ఏమిటంటే వచ్చే రెండు వారాల్లో ఇక్కడి వైద్య వ్యవస్థ కరోనా వైరస్ రోగులను accommodate చేయలేక collapse అవడం. కరోనా వైరస్ రోగులు ఇప్పుడున్న data ని బట్టి ప్రతి ఆరు రోజులకు double అవుతారు. Experts అంచనాల ప్రకారం వచ్చే రెండు వారాల్లో కరోనా సోకిన వారి సంఖ్య ఈ దేశంలో లక్షల్లోకి చేరుతుంది. వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 10-20 మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరమవుతుంది, తక్కువలో తక్కువ అందులో ఇద్దరు చనిపోతారు. అంటే పది లక్షల మందికి వైరస్ వస్తే, లక్ష మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది, 20,000 మంది చనిపోతారు. అమెరికాలో సుమారు 45,000 ICU beds, 160,000 ventilators మాత్రమే ఉన్నాయి. రెండు మూడు వారాల్లో ఇక్కడి వైద్య వ్యవస్థ collapse అయ్యే అవకాశం ఉందని అంచనా! ఇటలీలో లాగా ఇక్కడ కూడా వైద్య సదుపాయాలు సరిపోక ఎవరికి ఆక్సిజెన్ ఇవ్వాలి, ఎవరిని ventilator మీద పెట్టాలి అని వైద్యులు చాలా కష్టమైన నిర్ణయాలు తీస్కుకోవాల్సి వస్తుంది. అంటే బతికించే అవకాశం ఉన్నా సదుపాయాలు లేక బతికించలేని పరిస్థితి. ఇటలీ వలె ఇక్కడ కూడా funeral homes నిరాకరిస్తే బంధువుల మురిగే శవాలతో ఇళ్లలో ఉండాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని చాలామటుకు హాస్పిటల్ సిస్టంస్ లో ఒక వారం రోజులకన్నా ఎక్కువ సరిపడే మాస్కులు, గౌన్లు లేవని అంచనా! ఆ తర్వాత పరిస్థితి ఏమిటని ఆలోచిస్తేనే భయాందోళనలు కలిగించే పరిస్థితి. 

అమెరికాలోనే పరిస్థితి ఇదయితే ఎక్కువ శాతం ప్రజలకు వైద్యసదుపాయాలు అందుబాటులో లేని ఇండియాలో ఏమి జరుగుతుందో ఊహించడం అంత కష్టం కాదు. అందరూ ఈ pandemic ని serious గా తీసుకోవాలని నా మనవి. ఇండియాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అత్యవసరమైనతే తప్ప ఇంటి బయటకు వెళ్లొద్దని, ఎవరినీ కలవొద్దని చెప్పిన. ఈ వైరస్ నాకు సోకితే నేను కొంత జ్వరం, దగ్గులతో బాధ పడి కోలుకునే అవకాశాలు ఎక్కువ. కాని 60-70 వయసుల్లో ఉన్నవాళ్లు hospitalize అయే అవకాశం, చనిపోయే అవకాశం ఎక్కువ. Social distancing పాటించి high risk population అయిన older population ని, ఇతర వ్యాధులతో బాధపడుతూ immunity తక్కువ ఉన్న వాళ్లని కాపాడుకుందాం.

Let’s flatten the curve:

కరోనా వైరస్ ఇంఫెక్షన్ రాకున్నా బయటకు వెళ్లకుండా ఎందుకు ఉండాలి అనుకునేవాళ్లు ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. Social distancing పాటించకపోతే ఈ pandemic లో వైరస్ బారిన పడిన వాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగి healthcare systems ని overload చేస్తుంది. ఆ పరిస్థిలో డాక్టర్లు, ICU beds, ventilators సరిపోక ప్రాణనష్టం ఎక్కువ జరుగుతుంది.  Social distancing పాటించడం వల్ల ఒకేసారి ఎక్కువ మందికి వైరస్ సోకకుండా నివారించవచ్చు. తద్వారా వీలయినంత మందికి వైద్యం అందించే వీలు ఉంటుంది. pandemic curve ని flatten చేయడం ద్వారా వైరస్ బారిన పడేవారి సంఖ్య తగ్గకపోయినా దేశం లోని వైద్య వ్యవస్థ ఒకేసారి overload కాకుండా ఉంటుంది. ఇక్కడ పెట్టిన ఒక గ్రాఫ్ లో 'flattening the curve' అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 

పైన చెప్పిన అంచనాలన్నింటినీ కొంతవరకైనా మార్చే అవకాశం ఉంది. అది మనందరి చేతుల్లో ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, ఇతరులను కలవకుండా ఉండి వీలయినంత మంది ప్రాణాలను రక్షించుకుందాం!

Flattening the Pandemic Curve and stopping of spread of Novel Corona Virus(COVID-19)


Flattening the curve

The term refers to a curve in a chart that shows when a surge of new corona virus cases are expected to strike and illustrates why slowing the spread of the infection is nearly as important as stopping it.







1 comment:

AP Latest Updates

More

General Updates

More

Telangana GOs & Proceedings

More

Title 8

Credit Card
AP
TS
Credit Card
AP
TS
Credit Card
AP
TS
Credit Card
AP
TS
Credit Card
AP
TS
Credit Card
AP
TS

Title 10

Title 11

Credit Card
AP
TS
Credit Card
AP
TS
Credit Card
AP
TS
Credit Card
AP
TS
Credit Card
AP
TS
Credit Card
AP
TS
Top